Viral Video | పెంపుడు శునకాలు మనిషికి విశ్వాసం గల నేస్తాలన్న విషయం అందరికీ తెలిసిందే. కుక్కలకు విశ్వాసమే కాదు తెలివితేటలు కూడా ఎక్కువే. తన యజమాని చెప్పినట్టు నడుచుకుంటూ సందర్భానుసారంగా ప్రవర్తిస్తుంటాయి. తన యజమానితో సరదాగా ఆడుతూ.. సందడి చేస్తుంటాయి. ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ శునకం తన యజమాని గాల్లోకి విసిరిన బంతిని కింద పడకుండా తన తలతో బ్యాలెన్స్ చేస్తూ ఆడిన ఆట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాల్ కిందపడకుండా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని Buitengebieden అనే యూజర్ ట్విట్టర్లో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కుక్క ప్రతిభకు ఫిదా అవుతున్నారు. ‘ఇలా చేయడం ఒక్కోసారి మనుషుల వల్ల కూడా సాధ్యం కాదు’, ‘సో స్మార్ట్..’, ‘వాట్ ఏ స్కిల్స్..’, ‘ఈ కుక్కతో పోటీ పడటం కష్టమే..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Skills.. 💪
🎥 TT: bruisertheboston pic.twitter.com/07UggVmNB3
— Buitengebieden (@buitengebieden) February 1, 2023