ట్విటర్లో ఫన్నీ వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. ఈ వీడియోలు నెటిజన్లకు వినోదాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ అంకుల్ ట్రాఫిక్ పోలీసుతో కలిసి అదిరిపోయే స్టెప్పులేయగా, జనం చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు చాలా ఎంజాయ్ చేశారు.
ఈ వీడియోలో మధ్యవయస్సుగల వ్యక్తి వీధిలో అమితాబ్ బచ్చన్ ఫేమస్ సాంగ్ అయిన ‘జాను మేరీ జాన్’పై అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు అతడితో పాదం కలిపాడు. వారిద్దరి డ్యాన్స్ చూసేందుకు జనం పెద్దసంఖ్యలో గుమిగూడారు. ఈ అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా పోస్ట్ చేశారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అద్భుతమైన ఉదాహరణ ఇది’ అని ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసినవారంతా ఆ ట్రాఫిక్ పోలీస్ ప్రవర్తనతోపాటు డ్యాన్స్ చేసిన వ్యక్తి ప్రతిభను ప్రశంసిస్తున్నారు.
ऐसे पल #PublicPoliceFriendship के खूबसूरत उदहारण हैं! #DancingCop #DancingWithCop. pic.twitter.com/8Y11Nf5sOO
— Dipanshu Kabra (@ipskabra) April 25, 2022