జంతురాజ్యం అనేది మనకు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చిన్న జంతువులను పెద్ద జంతువులు వేటాడుతుంటాయి. ప్రాణాలనుంచి తప్పించుకునేందుకు చిన్న జంతువులు పరుగులు పెడుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఒక భయానక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఓ జింకను మొసలి భయంకరంగా పట్టేసుకున్న వీడియో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో కొన్ని జింకలు గుంపుగా ఓ నదిలో నీళ్లు తాగుతుంటాయి. అయితే, ఒక్కసారిగా నీటిలోంచి మొసలి పైకివచ్చి జింకలపై దాడిచేస్తుంది. ఉలిక్కిపడ్డ జింకలన్నీ పారిపోగా, ఒకటి మొసలి నోటికి చిక్కుతుంది. దీంతో మొసలి ఆ జింక తోకపట్టుకుని నీటిలోకి లాక్కెళ్తుంది. ఈ వీడియోను ‘వరల్డ్నేచర్’ అనే యూజర్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చాలామంది బాధతో కామెంట్లుపెట్టారు.