సాధారణంగా రోడ్ల మీదికి జంతువులు సడెన్గా దూసుకువచ్చినప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. రోడ్డు మీదికి ఎక్కువగా కుక్కలు, పిల్లలు లాంటి జంతువులు దూసుకొస్తుంటాయి. కానీ.. విచిత్రంగా ఓ ఆవు ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీదికి దూసుకొచ్చి రచ్చ రచ్చ చేసింది. ఆ ఆవు చేసిన రచ్చ చూసిన జనాలు బిత్తరపోయారు.
ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. బాగా కోపంతో ఉన్న ఆవు.. ఓ సందులో నుంచి వేగంగా రోడ్డు మీదికి పరిగెత్తుకుంటూ రావడాన్ని ఓ వ్యక్తి గమనించి పక్కకు జరుగుతాడు. వెంటనే రోడ్డు మీదికి దూసుకొచ్చి ఓ బైక్ను ఢీకొట్టింది ఆ ఆవు. ఈ ఘటనను అక్కడే కారులో ఉన్న ఓ వ్యక్తి షూట్ చేశాడు. బైక్ను ఆవు ఢీకొట్టడంతో బైక్ మీద ఉన్న వ్యక్తి కిందపడిపోయాడు. ఆ తర్వాత ఆవు రోడ్డు దాటి అవతలి వైపు వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇదే కర్మ అంటే.. కుక్కను హింసించిన వ్యక్తికి ఏమైందో చూడండి.. వైరల్ వీడియో
Smart Monkey : దీని తెలివి తెల్లార.. ఈ కోతి తెలివి చూస్తే నోరెళ్లబెడతారు.. వైరల్ వీడియో
సెకండ్ క్లాస్ పిల్లాడిని బిల్డింగ్ మీద తలకిందులుగా వేలాడదీసిన హెడ్మాస్టర్.. వైరల్ ఫోటో
Penis Plant : ఈ పువ్వు పూయడమే చాలా అరుదు.. దీని దగ్గరికి వెళ్తే కంపు వాసన
Model Photoshoot : తండ్రి శవం పక్కన మోడల్ ఫోటోషూట్.. నువ్వు మనిషివేనా అంటున్న నెటిజన్లు