Cow Farming : లక్షల జీతం వదిలేసి ఆవు పేడ, మూత్రం అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్న సివిల్ ఇంజనీర్
లక్షల జీతం వదిలేసి ఆవు పేడ, మూత్రం అమ్ముతూ | గ్రామాల్లో చాలామంది ఆవులు, బర్రెల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అవి ఇచ్చే పాలు, ఆవి వ్యవసాయంలో
గ్రామాల్లో చాలామంది ఆవులు, బర్రెల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అవి ఇచ్చే పాలు, ఆవి వ్యవసాయంలో చేసే పనితోనే వాళ్ల బతుకు. ఈ మధ్య ఆవులు, బర్రెల నుంచి వచ్చే పేడ, మూత్రానికి కూడా గిరాకీ పెరిగింది. అందుకే జయగురు అనే సివిల్ ఇంజనీర్ తన ఉద్యోగాన్ని వదిలేసి తన సొంతూరుకు వచ్చేసి తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. కేవలం 10 ఆవులతో ఇప్పుడు లక్షలు గడిస్తూ అక్కడ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

నాకు 9 టు 5 జాబ్ అంటే అస్సలు నచ్చదు. అందుకే.. కొన్ని రోజులు సివిల్ ఇంజినీర్ గా ఉద్యోగం చేశాక.. మా సొంతూరుకు వచ్చేశా. మా నాన్న దగ్గర ఉన్న 10 ఆవులతో డెయిరీ ప్రారంభించా. మెల్లగా డెయిరీని అభివృద్ధి చేశా. ఇప్పుడు 130 ఆవులు ఉన్నాయి. ఆవుల నుంచి వచ్చే ప్రతిదీ విలువైనదే. ఆవుల పేడను కూడా అమ్ముతాం. నెలకు 1000 బ్యాగుల ఆవు పేడను అమ్ముతాం. ఆవు మూత్రం, ఆవులను కడిగాక వచ్చే నీళ్లు.. ఇవన్నీ నేలకు ఎంతో బలాన్నిస్తాయి. చివరకు ఆవులు చనిపోయినా కూడా వాటి బాడీలను కొన్ని రోజుల పాటు స్టోర్ చేసి.. లిక్విడ్ ఫెర్టిలైజర్ గా పంటలకు ఉపయోగిస్తాం.. అని చెప్పాడు జయగురు.
రోజులు 750 లీటర్ల పాలను తన డెయిరీ నుంచి ఉత్పత్తి చేస్తున్నాడు. నెలకు 30 నుంచి 40 కిలోల నెయ్యిని ఉత్పత్తి చేస్తారు. ఆవుల నుంచి వచ్చే పాలు, పేడ, మూత్రం.. అన్నింటి మీద నెలకు 10 లక్షలకు వరకు సంపాదిస్తూ.. అక్కడి స్థానికులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు జయగురు. ఇంతకీ జయగురుది ఎక్కడో తెలుసా? కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పోటెత్తిన వరద : వంట పాత్రలో పెండ్లివేదికకు వచ్చిన వధూవరులు!
మీరు లొడలొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోసమే ఈ యాప్స్
ఒకప్పుడు భిక్షాటన ఆ ఊళ్లో కులవృత్తి.. కానీ ఆ ఒక్క నిర్ణయంతో..
ఈ ఐదు రకాల వ్యక్తులను అస్సలు పెండ్లి చేసుకోవద్దు..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

