ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినవాళ్లకు గౌరవమర్యాదలతో వీడ్కోలు పలుకుతారు. సైనికులతో కలిసి దేశరక్షణలో పాలుపంచుకునే ఆర్మీ డాగ్స్‌కి కూడా అధికార లాంఛనాలతో రిటైర్మెంట్ వేడుక నిర్వహిస్తారు. ఈమధ్యే పదేండ్లు సిఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) లో సేవలందించిన రెండు డాగ్స్‌కి వీడ్కోలు పలికారు సిఐఎస్ఎఫ్ అధికారులు. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని కెన్నెల్ బిల్డింగ్‌లో వాటి రిటైర్మెంట్ ఈవెంట్ ఒక వేడుకలా జరిగింది.
ఎస్యూవీ వాహనంలో ఎక్కించి
సిఐఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ టీంలో లాబ్రడార్ జాతికి చెందిన స్పార్కీ అనే ఆడకుక్క, కాకర్ స్పానియెల్ జాతికి చెందిన ఇవాన్ అనే మగకుక్క పదేండ్లు పనిచేశాయి. రెండు రోజుల క్రితం వాటి సర్వీస్ ముగియడంతో రిటైర్మెంట్ వేడుక నిర్వహించారు. వాటి మెడలో పూలదండలు వేసి, వాటి సర్వీస్‌కి గుర్తింపుగా మెడల్స్ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని ఎస్యూవీ వాహనంలో ఎక్కించి, సీఎస్ఎఫ్ సిబ్బంది దాన్ని తాడుతో లాగారు. ఈ వీడియోని ఎఎన్ఐ (ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ )ట్విట్టర్లో పెట్టింది. రెండు రోజుల్లోనే ఈ వీడియోని 66 వేలమందికి పైగా చూశారు. ఈ రెండు డాగ్స్ స్థానంలో లాబ్రడార్ జాతికి చెందిన జూలీ, రూబీలను తమ డాగ్ స్క్వాడ్ టీంలోకి తీసుకోనుంది సీఐఎస్ఎఫ్.
#WATCH | CISF bids farewell to canine heroes. Two canines of the Central Industrial Security Force (CISF) at Cochin International Airport Limited (CIAL) retired after around ten years of meritorious service (02.11) pic.twitter.com/41q6RwhcWx
— ANI (@ANI) November 3, 2022