కరోనా నిబంధన వల్ల చాలామంది పెళ్లి వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వాలు నిబంధనలు ఎత్తేశాయి. దీంతో ఇప్పుడు పెద్ద సంఖ్యలో పెళ్లివేడుకలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే అనేక పెళ్లివేడుకలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తెలంగాణలో ‘బుల్లెట్‌బండి’ పాటపై బరాత్‌లో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట హల్చల్ చేసింది. అలాంటి వీడియో మరొక్కటి ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్ నటించిన సినిమాల్లోని రొమాంటిక్ పాటలపై వధూవరులు చేసిన డ్యాన్స్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో వధూవరులు స్టేజీపైకి ఎప్పుడొస్తారా అని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అంతా ఎదరుచూస్తున్నారు. ఒక్కసారిగా వధువు సిల్వర్ కలర్ డ్రెస్‌లో.. వరుడు బ్లాక్ కలర్ షూట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. షారుక్‌ఖాన్ సినిమాల్లోని రొమాంటిక్ పాటలు బ్యాంక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, ఇద్దరూ లయబద్ధంగా స్టెప్పులేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో వెడ్డింగ్ వరల్డ్ పేజ్ పోస్ట్చేయగా, ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. చూసినవాళ్లంతా ఫిదా అవుతున్నారు.