బ్లాక్‌హోల్ నుంచి శబ్దాలు..హార్రర్ సినిమా మ్యూజిక్‌లా ఉందంటున్న నెటిజన్లు!!
విశ్వంలో ఎన్నో బ్లాక్‌హోల్స్ ఉన్నా పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ మధ్యలో ఉన్న బ్లాక్‌హోల్ ప్రత్యేకం. భూమినుంచి 240 మిలియన్ కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఈ బ్లాక్‌హోల్ 2003నుంచి శబ్దాలతో సంబంధం కలిగి ఉంది. తాజాగా, నాసా శాస్త్రవేత్తలు సోనిఫికేషన్ అనే అత్యాధునిక విధానంతో ఈ బ్లాక్‌హోల్ చేస్తున్న శబ్దాలను విడుదల చేశారు.
విశ్వరహస్యాల్లో ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇంకా అంతుచిక్కని వాటిలో ముందుండేవి బ్లాక్ హోల్స్. ఇవి అంతరిక్షంలో ఒక భాగం. ఒక చిన్న కణం కాదుగదా ఆఖరికి కాంతిలాంటి విద్యుదయస్కాంత వికిరణం కూడా దాని నుంచి తప్పించుకోలేనంతటి బలమైన గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండే వస్తువు దేన్నైనా బ్లాక్ హోల్ అనవచ్చు. విశ్వంలో ఎన్నో బ్లాక్‌హోల్స్ ఉన్నా పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ మధ్యలో ఉన్న బ్లాక్‌హోల్ ప్రత్యేకం. భూమినుంచి 240 మిలియన్ కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఈ బ్లాక్‌హోల్ 2003నుంచి శబ్దాలతో సంబంధం కలిగి ఉంది. తాజాగా, నాసా శాస్త్రవేత్తలు సోనిఫికేషన్ అనే అత్యాధునిక విధానంతో ఈ బ్లాక్‌హోల్ చేస్తున్న శబ్దాలను విడుదల చేశారు.
నాసాకు చెందిన చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ కనుగొన్న బ్లాక్‌హోల్ డేటాను ధ్వని తరంగాలుగా మార్చారు. సోనిఫికేషన్ ద్వారా మొదటిసారి ఈ బ్లాక్‌హోల్ చేసే శబ్దాలను వినేలా నాసా శాస్త్రవేత్తలు ఆడియోతోకూడిన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను చంద్ర అబ్జర్వేటరీ ట్విటర్లో షేర్చేయగా, వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ 1,61000 మంది వీక్షించారు. ఈ కృష్ణబిలం చేసే శబ్దం అచ్చు హార్రర్ సినిమా మ్యూజిక్‌లా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
New sonifications of well-known black holes have been released for #BlackHoleWeek⚫!
#1 The Perseus galaxy cluster — famous for sound waves detected around its black hole by Chandra, some 57 octaves below middle C. And… (1/2) pic.twitter.com/nX1hZe7SPI— Chandra Observatory (@chandraxray) May 4, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

