Viral video: ఓ 22 ఏండ్ల మోడల్ పీకల దాకా మద్యం సేవించింది. ఆపై ఓ రద్దీ రోడ్డు మీదకు వచ్చింది. అటుగా వెళ్తున్న ఓ ఆర్మీ వాహనాన్ని అడ్డగించింది. ఆ వాహనాన్ని కాలితో తంతూ హల్చల్ చేసింది. ఎడమవైపు హెడ్‌లైట్‌పై తన హిల్స్‌తో తన్ని పగులగొట్టింది. ఆ వాహనంలోని ఓ ఆర్మీ అధికారి అడ్డుకునే ప్రయంత్నం చేయగా తోసి పడేసింది. యువతి చేసిన ఆ హంగామా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే, తప్పతాగి నడిరోడ్డుపై హంగామా చేసిన ఆ యువతిపై గ్వాలియర్‌లోని పాడవ్ ఏరియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఆ యువతిని విచారించిన అనంతరం పాడవ్ పోలీసులు వివరాలు వెల్లడించారు. తాగి నానా యాగి చేసిన ఆ యువతి ఢిల్లీకి చెందిన ఓ మోడల్ అని, గ్వాలియర్‌లో ఓ ఈవెంట్లో పాల్గొనడం కోసం మరో ఇద్దరు మోడల్స్‌తో కలిసి వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆమె పూటుగా మద్యం సేవించి హంగామా చేసిందన్నారు.
ఆర్మీ వాహనంపై దాడి చేసినప్పటికీ ఆమెపై ఆర్మీ వాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అయితే, పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేసినందుకు ఆమెపై న్యూసెన్స్ కేసు నమోదు చేశామని పాడవ్ పోలీసులు తెలిపారు. ఆమెతోపాటు వచ్చిన మోడల్స్ ఆమెకు జామీను ఇవ్వడంతో బెయిల్‌పై విడిచిపెట్టామని చెప్పారు. కాగా, యువతి హల్చల్ చేసిన వీడియోను క్రిష్ రాజ్ పురోహిత్ అనే వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్టు చేశాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది.