గడిచిన పదిహేను రోజులనుంచి పెట్రో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ లీటర్ పెట్రోల్ ధర రూ. 120 దాటింది. సామాన్యులు పెట్రోల్ కొట్టించుకోలేని పరిస్థితికి వెళ్లిపోయారు. దీంతో తమ కష్టాలపై నెట్టింట జోకులేసుకుంటున్నారు. ఫన్నీ మీమ్స్ రూపంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై తమ నిరసన తెలుపుతున్నారు. కాగా, పెట్రోల్ ధరల పెంపుపై ఓ బీహారీ యువకుడు పాడిన పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటకు ‘పెట్రోల్ సజ్నీ’ అని పేరు పెట్టారు.
బీహార్‌కు చెందిన విశ్వజీత్ అనే యువకుడు ఈ పాటను పాడాడు. “కైసే మైలే ఆవు తోరా సే తు బోలా సజ్నీ, హోలో మెహెంగా ధేర్ అబ్ తా పెట్రోల్ సజ్నీ” ( ప్రియా పెట్రోల్ రేట్లు పెరిగినయ్..ఇక నిన్ను ఎట్లా కలిసేది.. నీ దరికి ఎలా చేరేది ) అంటూ పాటందుకున్నాడు. ఈ పాటను ఫేస్బుక్లో పెట్టగా, ఇప్పటివరకూ 2లక్షల మంది వీక్షించారు.