bangalore auto driver: ఈ ఆటోవాలా ఐడియా సూపర్
కస్టమర్లు నాకు కింగ్ అంటున్న బెంగళూరు ఆటో డ్రైవర్.
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు జర్నీ చేయాలంటే కొంచెం చికాకుగా అనిపిస్తుంది. ఎక్కువ దూరం ఆటోలో వెళ్లాలంటే బోర్ అనిపిస్తుంది. కానీ, బెంగళూరుకు చెందిన రాజేష్ ఆటో ఎక్కితే మాత్రం అస్సలు బోర్ కొట్టదు. జర్నీ ఆసాంతం కంఫర్ట్‌గా ఉంటుంది. ఆటో ఎక్కినవాళ్లకు బోర్ అనిపించడకుండా ఉండడానికి ఇతను ఏం చేశాడంటే…. ఆటోలో శానిటైజర్, ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు నీళ్ల బాటిళ్లు, రిఫ్రెష్నర్స్, బిస్కెట్లు, కాఫీ చాక్లెట్లు కూడా అందుబాటులో ఉంచాడు. దేవుళ్ల పుస్తకాలు కూడా పెట్టాడు. కస్టమర్లు తన ఆటోలో రైడ్‌ని గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాడు రాజేష్. దాంతో, ఆటో ఎక్కిన వాళ్లు ఐడియా సూపర్ అంటూ అతడిని మెచ్చుకుంటున్నారు.
కస్టమర్ నాకు కింగ్
రాజేష్ ఆటో ఎక్కిన ఉత్తమ్ కశ్యప్ అనే సోషల్ మీడియా యూజర్ ఆటోలోని ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ ఎందుకు పెట్టావని అడిగితే నాకు కస్టమర్ కింగ్. వాళ్లకు నా ఆటోలో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యంగా ఉండాలనేది నా ఉద్దేశం అని చెప్పాడు రాజేష్. దాంతో ఆటో లోపల ఫొటోల్ని ట్విట్టర్లో పెట్టాడు ఉత్తమ్. ఇతని ఆటో ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులో ఈమధ్యే ఆటో యూనియన్ వాళ్లు సొంతంగా నమ్మ యాత్రి అనే యాప్ తీసుకొచ్చారు. దాంతో, ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు రాజేష్ తన ఆటోలో ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

