Viral News | ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఏటీఎమ్‌లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు ఏటీఎమ్‌లో డబ్బులు డ్రా చేసుకోగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అమేథిలోని ఓ ఏటీఎమ్ నుంచి కొందరు స్థానికులు డబ్బులు డ్రా చేశారు. అయితే, అందులో నుంచి నకిలీ రూ.200 నోటు వచ్చింది. ఇది గమనించిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆ నోటును మొదట చూస్తే రూ.200 నోటులానే అనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప అది నకిలీ అని గ్రహించలేము. సాధారణంగా ఏదైనా నోటుపై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ఉంటుంది. అయితే, ఈ ఏటీఎమ్‌లో నుంచి వచ్చిన రూ.200 నోటుపై మాత్రం ‘పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ఒకవైపు.. ‘ఫుల్ ఆఫ్ ఫన్’ అని మరోవైపు ఉంది.
ఈ విషయాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఏటీఎమ్ నుంచి నకిలీ నోట్లు వస్తున్నాయన్న వార్తతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న స్థానికులు.. ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
यूपी के अमेठी जिला में ATM ने निकला 'चूरन वाला नोट', दो-दो सौ रुपए के नकली नोट निकले
कई ग्राहकों को नकली नोट मिलने से हड़कंप pic.twitter.com/Mns1EPNAh7— Priya singh (@priyarajputlive) October 25, 2022