విరాట్‌కొహ్లీ, అనుష్కశర్మ జంటను ఇష్టపడే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. విరుష్క జంట తమ చిలిపి చేష్టలతో ఎప్పుడూ అలరిస్తూ ఉంటారు. వారిద్దరూ కలిసి నవ్వులు చిందించే ఫొటోలు సోషల్‌మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఐపీఎల్ మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌పట్టిన కొహ్లీ, అనుష్కశర్మకు విజయసంకేతం చూపాడు. అదిచూసి అనుష్కశర్మ నిల్చుండి అందంగా నవ్వింది. ఈ ఫొటోను షేర్చేస్తూ విరుష్క ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
తాజా ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఆటగాడు విరాట్‌కొహ్లీ బ్యాట్‌తో అంతగా రాణించలేకపోతున్నాడు. కానీ ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నాడు. శనివారం (ఏప్రిల్ 16) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌కొహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ ఆ మ్యాచ్‌ను టర్న్ చేసింది. కాగా, క్యాచ్ పట్టినవెంటనే కొహ్లీ స్టాండ్స్‌లో ఉన్న అనుష్కవైపు తిరిగి విజయసంకేతం చూపాడు. దీంతో ఆమె నిల్చుని చప్పట్లు కొడుతూ, చిరునవ్వులు చిందించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.