Anand Mahindra : గల్లీ క్రికెట్.. రీల్ మ్యాచ్ కాదు.. రియల్ మ్యాచ్.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. వైరల్ వీడియో
గల్లీ క్రికెట్.. రీల్ మ్యాచ్ కాదు.. రియల్ మ్యాచ్.. ఆనంద్ మహీంద్రా ఫిదా | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన ఎంత బిజీగా ఉన్నా తరుచూ తన ట్విట్టర్ అకౌంట్లో ఏదో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటారు. కొత్త విషయాలను, కొత్త టాలెంట్‌ను ప్రొత్సహిస్తుంటారు. వాళ్లు ఎవరైనా సరే.. తను కూడా ఓ చేయి వేస్తారు. ఇదివరకు అలా చాలా వీడియోలను ఆయన ట్వీట్ చేసి.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

తాజాగా.. ఆనంద్ మహీంద్ర మరో వీడియోను పోస్ట్ చేశారు. అది గల్లీ క్రికెట్‌కు సంబంధించిన వీడియో. గల్లీ క్రికెట్ అంటే తెలుసు కదా. పిల్లలు గల్లీలో సరదాగా క్రికెట్ ఆడుతారు. అందులో ట్విస్ట్ ఏముంది అంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్.
కొందరు పిల్లలు.. కొంచెం దూరంగా కూర్చొని గల్లీ క్రికెట్ చూస్తుంటారు. అది కూడా టీవీలో లైవ్‌గా. అదేంటి.. గల్లీ క్రికెట్‌ను కూడా టీవీలో లైవ్‌గా ఇస్తున్నారా? అని అనుకోకండి. అది టీవీనే కానీ.. టీవీ కాదు. కేవలం స్క్రీన్ మాత్రమే కనిపించే టీవీ. ఆ టీవీ నుంచి చూస్తే.. దాని వెనుక ఉన్నవన్నీ కనిపిస్తాయి. కేవలం ఫ్రేమ్ మాత్రమే ఉన్న టీవీ అది. అందుకే ఫ్రేమ్ గుండా పిల్లలంతా ఆ గల్లీ క్రికెట్‌ను చూస్తుంటారు.
ఆ వీడియోలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే?
అయితే.. అది రీల్ మ్యాచ్ కాదని.. ఫ్రేమ్ నుంచి వెనుక జరుగుతున్న గల్లీ క్రికెట్‌ను పిల్లలు చూస్తున్నారని.. లైవ్ మ్యాచ్ అని బంతి వచ్చి ఆడియెన్స్ మీద పడేవరకు తెలియదు. బ్యాట్స్‌మెన్ బాల్‌ను కొట్టగానే.. ఆ టీవీ ఫ్రేమ్ నుంచి బయట పడుతుంది. దీంతో.. ఫీల్డర్ వచ్చి ఫ్రేమ్‌లో నుంచి తొంగి చూసి బంతి ఇవ్వాలంటూ అక్కడ కూర్చొని టీవీ చూస్తున్న పిల్లలను అడుగుతాడు. దీంతో ఆ వీడియో చూసేవాళ్లు షాక్ అవ్వాల్సిందే.
పిల్లల టాలెంట్‌ను చూసి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది పాత వీడియోనే కానీ.. నాకు ఎందుకో ఈ వీడియోను మరోసారి పోస్ట్ చేయాలనిపించింది. కరోనా మహమ్మారి మనల్ని స్క్రీన్కు ఎలా పరిమితం చేసిందో అందరికీ తెలుసు. ఏ పని చేయాలన్నా.. స్క్రీన్ ద్వారానే.. లైవ్‌లో ఎంటర్టైన్మెంట్ను కూడా మిస్ అయిపోయాం. అందుకే.. ఆ టీవీ స్క్రీన్‌లో నుంచి లోపలికి వెళ్లి.. స్క్రీన్‌ను కాకుండా రియాల్టీని ఎంజాయ్ చేయాలని ఉంది.. అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు నెటిజన్లు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే.. పిల్లల క్రియేటివిటీని కూడా మెచ్చుకుంటున్నారు. ఆ వీడియోను మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
An old video. But it reminded me today of how the pandemic has forced us to put a ‘Screen’ in front of every activity. I want to crawl through that screen and experience the “real” thing again… pic.twitter.com/FjvxUsv7Gm
— anand mahindra (@anandmahindra) September 12, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video : హెయిర్ కట్ చేయనీయకుండా గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. బార్బర్ ఏం చేశాడంటే?
6.5 లక్షలు పెట్టి వేలంలో కొబ్బరికాయ కొన్న పళ్ల వ్యాపారి.. ఏంటి ఆ కొబ్బరికాయ స్పెషాలిటీ?
హైదరాబాద్ సిటీలో ఎంత స్పీడ్‌తో వాహనాలు నడపాలో తెలుసా
sai dharam tej accident | హైదరాబాద్‌లో ఎన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

