ఓ 20 కిలోల బండరాయిని మీరెన్నిసార్లు పైకెత్తగలరు? విరామం లేకుండా ఓ ఐదు లేదా పదిసార్లకంటే ఎక్కువసార్లు ఎత్తగలరా? మీరు బాడీ బిల్డర్ అయితే ఓ 20 లేదా 25 సార్లు ఎత్తగలరు. కానీ ఓ వ్యక్తి గంటలో 87.6 కిలో రాయిని 194 సార్లు పెకెత్తాడు. అతడి కండబలం చూసి గిన్నిస్‌బుక్ నిర్వాహకులే ఆశ్చర్యపోయారు.
డైలాన్ మిరాగ్లియా.. అమెరికాలోని బౌల్డర్ కౌంటీ హైజీన్ ఫైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్‌లో అగ్నిమాపక సిబ్బందిగా పనిచేస్తాడు. మంచి బాడీ బిల్డర్ అయిన మిరాగ్లియాకు బరువులు ఎత్తి గిన్నిస్‌బుక్‌లో ఎక్కాలని కల. ఇందుకోసం ఎంతో సాధన చేశాడు. 87.6 కిలోల అట్లాస్ రాయిని గంటలో 194 సార్లు పైకెత్తాడు. గిన్నిస్ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఈ ఫీట్ చూసి గిన్నిస్ బుక్ నిర్వాహకులు ఫిదా అయ్యారు.