ఎక్కడైనా సింహం వేటాడుతుంది.. మిగతా జంతువులు ప్రాణభయంతో పరుగులు పెడతాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. బర్రెల మందనుంచి తప్పించుకునేందుకు ఓ సింహం చెట్టెక్కింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో బర్రెల మంద వెంటపడుతుండగా ఓ ఆఫ్రికన్ సింహం చెట్టును పట్టుకుంది. అనంతరం ఆ చెట్టును అమాంతం ఎక్కేసి బర్రెల మందను భయంభయంగా చూస్తుండిపోయింది. ఈ వీడియో వైల్డ్ యానిమల్ షార్ట్స్ అనే ఇన్స్టాగ్రాం పేజీలో *బర్రెల మందనుంచి తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు చెట్టుపైకి ఎక్కుతున్న సింహం* అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా, 21,000 మందికిపైగా లైక్ చేశారు. చాలామంది వీక్షించడంతోపాటు ఫన్నీగా కామెంట్ చేశారు.