అమెరికాకు చెందిన జిమ్మీ డొనాల్డ్స్ ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్‌గా నిలిచాడు. మిస్టర్ బీట్స్‌గా పాపులర్ అయిన జిమ్మీకి ప్రస్తుతం దాదాపు 112 మిలియన్ సబ్స్క్రైబర్స్ (11 కోట్లకు పైగా) ఉన్నారు. గత కొన్నాళ్లుగా యూట్యూబ్‌లో రారాజుగా వెలుగొందుతున్న స్వీడన్‌కి చెందిన చెందిన ఫెలిక్స్ అర్వింద్ ఉల్ఫ్ జెల్బర్గ్ని ఇతను వెనక్కి నెట్టాడు. ప్యూ డై పైగా పేరుగాంచిన ఫెలిక్స్‌కు యూట్యూబ్‌లో 111.8 మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బీస్ట్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్నవాళ్ల సంఖ్య ఈమధ్యే 111.9 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది జూలైలో వంద మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ని సాధించిన రెండో యూట్యూబర్‌గా జిమ్మీ గుర్తింపు సాధించాడు.
స్క్విడ్ గేమ్స్ సిరీస్ వీడియోలతో
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న స్క్విడ్ గేమ్స్ సిరీస్‌ని రిక్రియేట్ చేయడంతో జిమ్మీ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దాంతో, అతడి యూట్యూబ్ ఛానెల్‌ని చాలామంది సబ్స్క్రైబర్స్ చేసుకున్నారు. అంతేకాదు 2021లో అత్యధిక ఆదాయం సంపాదించిన యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇతను యూట్యూబ్‌లో వీడియోలు చేయడమే కాకుండా అమెరికాలో మిస్టర్ బీస్ట్ బర్గర్ అనే రెస్టారెంట్‌ని కూడా నడిపిస్తున్నాడు. అమెరికాలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూటూబ్ ఛానెళ్లలో మనదేశానికి చెందిన టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్ ప్రథమ స్థానంలో ఉంది. టీ సిరీస్‌ని 229 మిలియన్ల మంది( 20 కోట్లకు పైగా) సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.