సోషల్మీడియాలో జంతువుల వీడియోలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఆసక్తికరమైన వీడియో ఏది వచ్చినా చూసి ఆనందించడంతోపాటు షేర్ చేస్తుంటారు. తాజాగా, ఓ పిల్ల కోతి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ తిన్న పిల్ల కోతి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నది.
ఈ వీడియోలో ఓ బుల్లి కోతి నేలపై కూర్చుని ఉంటుంది. దానికి ఓ వ్యక్తి డ్రాగన్ ఫ్రూట్ కట్చేసి ఇస్తాడు. మొదట అది ఎలా తినాలో తెలియక కోతిపిల్ల అయోమయానికి గురవుతుంది. ఆ వ్యక్తి పండును తీసుకుని తిన్నట్లు నటిస్తాడు. అనంతరం పిల్ల కోతి పండు తీసుకుని తింటూ వెరైటీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఈ వీడియోను లవింగ్ యానిమల్స్.డీజీ అనే యూజర్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ కోతికి నునుక్ అని పేరు పెట్టారు. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. వందలమంది సరదా కామెంట్లతో హోరెత్తించారు.