Viral Video : మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత జనం మారిపోయారు. మనిషికి మనిషికి మధ్య మాటలే కరువయ్యాయి. నలుగురు ఒకే దగ్గర కూర్చుని కూడా ఎవరిఫోన్లో వాళ్లే మునిగితేలుతున్నారు. ఈ మొబైల్ యూజర్స్‌ను ఆకర్షించేందుకు కొందరు రీల్స్ పిచ్చిలో పడిపోతుంటే.. మరికొందరు వ్లాగ్స్ పేరుతో తమ రోజువారీ కార్యాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇంకొందరైతే అంతటితో ఆగకుండా తమ పర్సనల్ విషయాలను కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు.
ఇంకా కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ బెడ్రూమ్ విషయాలను కూడా బయటపెట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో చాలా మంది వ్యూస్ కోసం ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ నూతన జంట కూడా ఇలాంటి పనే చేసింది. తమ తొలిరాత్రి బెడ్ రూమ్ దృశ్యాలు వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.
ఆ నూతన దంపతులు తమ ఫస్ట్ నైట్ రోజే వ్లాగ్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నాలుగు గోడల మధ్యన జరగాల్సిన ఫస్ట్ నైట్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడమేంటని చీవాట్లు పెడుతున్నారు. మరికొందరు ‘నైస్, క్యూట్ కపుల్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘వ్లాగ్స్ సాంప్రదాయం పెళ్లి నుంచి ఫస్ట్ నైట్ వరకూ చేరిందన్నమాట’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘వీళ్ల పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’ అని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ వీడియోలో ఏముందంటే.. ఫోన్ కెమెరా ఆన్ చేసిన భర్త.. భార్య భుజంపై చేయి వేసి ‘హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు మా ఫస్ట్ నైట్ జరగబోతోంది. మంచాన్ని సువాసన వెదజల్లే పూలతో ఎంతో అందంగా అలంకరించారు’ అని చెప్తాడు. ఆ తర్వాత ఆమెను కూడా మాట్లాడమంటాడు. ఆమె కూడా కెమెరా ముందు నవ్వుతూ తను చెప్పదల్చుకున్నది చెప్తుంది. ఇలా ఎవరూ చేయని విధంగా ఫస్ట్ నైట్ రోజున వీళ్లు చేసిన వ్లాగ్పై నెటిజన్లు విభిన్న స్పందనలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Suhagraat Vlog 🥴
These vloggers have gone totally mad.
Wait for the blurred clip 😹 pic.twitter.com/PMsiC5dS6U
— Sunanda Roy 👑 (@SaffronSunanda) July 5, 2024