ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. కొన్నిచోట్ల ఎండవేడిమి తాళలేక పక్షులు నేలకొరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ వృద్ధుడు తన మానవతాహృదయం చాటాడు. నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు.
రోడ్డుపైన ఎండలో అల్లాడుతున్న పావురాలను ఓ వృద్ధుడు నీళ్లతో తడిపాడు. రోడ్డుపక్కన కుర్చీ వేసుకొని కూర్చొని, పైప్‌తో పావురాలపై నీటిధార వదిలాడు. ఈ వీడియోను ఐఏఎస్ అదికారి అవనీశ్ శరణ్ ట్విటర్లో షేర్ చేయగా, వైలర్‌గా మారింది.
ఈ 28 సెకన్ల క్లిప్‌ను ఇప్పటివరకూ లక్షమంది వీక్షించారు. అతడి మానవతా హృదయానికి నెటిజన్లు జేజేలు పలికారు. ఈ రోజు చూసిన అతి అద్భుతమైన వీడియో ఇదేనని ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటివి చూసినప్పుడు మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుందని మరొకరు వ్యాఖ్యానించారు.
पक्षियों को भी इस गर्मी से राहत चाहिए.❤️ pic.twitter.com/ooDieIzZJb
— Awanish Sharan (@AwanishSharan) April 10, 2022