Harsh Goenka | ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ ఆసక్తికర విషయాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలకు చేరువలో ఉంటుంటారు. ఆయన షేర్ చేసే వీడియోలు, పోస్టులు ప్రజలకు స్ఫూర్తిని కలిగించేవిగా ఉంటాయి. తాజాగా, ఆయన షేర్ చేసిన వీడియో ఒకటి నిజమైన లీడర్ షిప్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్‌లో గల రద్దీ రహదారిపై కొన్ని టర్కీ కోళ్లు రోడ్డు దాటుతూ కనిపిస్తాయి. అందులోని ఓ కోడి రోడ్డు మధ్యలో నిల్చొని.. మిగిలిని కోళ్లన్నీ రోడ్డు దాటాకా చివరి కోడితోపాటు అది రోడ్డు దాటుతుంది. కోళ్లు రోడ్డు దాటుతున్న సమయంలో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ఉంటాయి. ఈ వీడియో షేర్ చేసిన గోయెంకా ‘లీడర్ షిప్‌కు ఇదో పాఠం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
‘లీడర్ షిప్ అంటే అధికారం కాదు.. అదో బాధ్యత’ అనేందుకు నిదర్శనంగా ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘మీరు చెప్పింది నిజం సర్.. లీడర్ షిప్ అంటే ఇలా ఉండాలి’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
A lesson in leadership… pic.twitter.com/BHWSiftE75
— Harsh Goenka (@hvgoenka) November 6, 2022