Viral video: టొయోటా ఫార్చూనర్ నడిపిన ఎనిమిదేళ్ల బాలుడు..నెటిజన్లు షాక్!!
సోషల్‌మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ రోడ్లపై ఓ ఎనిమిదేళ్ల బాలుడు టొయోటా ఫార్చూనర్ నడపడం కలకలం రేగింది. ఇండియాలోలాగే పాకిస్తాన్లోకూడా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 18 ఏళ్ల వయస్సు నిండాలి. కానీ, ఈ వీడియోలో బాలుడు పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో ఎనిమిదేళ్లకే ఎస్యూవీ నడిపి నిబంధనలు అతిక్రమించాడు.
సోషల్‌మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ రోడ్లపై ఓ ఎనిమిదేళ్ల బాలుడు టొయోటా ఫార్చూనర్ నడపడం కలకలం రేగింది. ఇండియాలోలాగే పాకిస్తాన్లోకూడా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 18 ఏళ్ల వయస్సు నిండాలి. కానీ, ఈ వీడియోలో బాలుడు పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో ఎనిమిదేళ్లకే ఎస్యూవీ నడిపి నిబంధనలు అతిక్రమించాడు.
ఈ వీడియోలో బాలుడిని ఆయాన్‌గా గుర్తించారు. ఇతడు ఆరేళ్లనుంచే కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో తన పదేళ్ల అక్క కారు ముందు నిల్చొని మొదట అయాన్ డ్రైవింగ్ స్కిల్స్‌ను వివరించింది. అనంతరం బాలుడు ఎస్యూవీ డోర్ తీసి, డ్రైవింగ్ సీట్లో కూచున్నాడు. సీటు బెల్టు పెట్టుకోకుండానే కాస్త ముందుకు వంగి స్టీరింగ్ తిప్పుతూ రోడ్డుపై దూసుకెళ్లాడు. అతడి పక్కనుంచి కొన్ని వాహనాలు ఓవర్టేక్ చేయడం కనిపించింది.
ఈ వీడియోను ‘అయాన్ అండ్ అరీబా’ అనే యూట్యూబ్ చానల్లో ఏప్రిల్ 1న అప్లోడ్ చేశారు. ‘ఎనిమిదేళ్ల బాలుడు టొయోటా ఫార్చూనర్ ఎలా నడుపుతాడో చూపిస్తాం’ అని హెడ్డింగ్ పెట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. చాలామంది ఆ అబ్బాయి తల్లిదండ్రులపై మండిపడ్డారు. ఈ పిల్లలు ఇతరుల లైఫ్‌ను రిస్క్‌లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది చట్టవిరుద్ధం, బాధ్యతారాహిత్యమైనది, ప్రమాదకరమైనదని, ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటివి ఉపేక్షించకూడదని పలువురు కామెంట్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

