రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఉక్రెయిన్ శవాల దిబ్బగా మారిపోయింది. చిన్న పిల్లలతో కలిసి కుటుంబాలకు కుటుంబాలే శరణార్థులుగా వేరే దేశం వెళ్లిపోతున్నాయి. కాగా, రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ఓ మూడేళ్ల బాలుడు పాడిన పాట అందరి హృదయాలను కదిలించింది. ‘నాట్ యువర్ వార్’ అనే పాట పాడగా, సభికులంతా కన్నీటి పర్యంతమయ్యారు.
ఉక్రెయిన్‌లోని ఇర్పిన్‌కు చెందిన మూడేళ్ల వయస్సుగల లియోనార్డ్ బుష్ కీవ్ సబ్వేలో జరిగిన స్టేజీ షోలో యుద్ధ వ్యతిరేక గీతాన్ని ఆలపించాడు. మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఓ చారిటీ కార్యక్రమంలో ఒకియాన్ ఎల్జీతో కలిసి లియోనార్డ్ బుష్ ‘నాట్ యువర్ వార్’ గీతం మొదలెట్టగానే, సభికులంతా సైలెంట్ అయిపోయారు. ఆ బాలుడి పాట విని కన్నీళ్లు కార్చారు. కాగా, రష్యా దళాలు ఈ బాలుడి స్వస్థలంపై దాడి చేయడంతో అతడి కుటుంబం మొత్తం పశ్చిమ ఉక్రెయిన్‌కు వలసవెళ్లింది.
A 3-year-old Leon Bush from #Irpin, who sang “Oy, u luzi Chervona kalyna” near the house, performed the song “Ne tvoya viyna” (Not Your War) by Okean Elʹzy during a charity concert in the Kyiv metro.#SlavaUkraini #StandWithUkraine pic.twitter.com/wFSSsUdyQR
— UkraineWorld (@ukraine_world) April 27, 2022