IRCTC Punya Kshtra Yatra | దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శనకు వెళ్లాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా పూరి, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్ గౌరవ్ రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.
‘పుణ్య క్షేత్ర యాత్ర’ (PUNYA KSHETRA YATRA) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. జూన్ 28న ఈ ప్యాకేజీ (Punya Kshtra Yatra Tour Package) అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో పూరి(Puri), గయ(Gaya), వారణాసి(Varanasi), అయోధ్య(Ayodhya), ప్రయాగ్‌రాజ్(Prayagraj) లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు. సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 8 రాత్రులు, 9 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ ‘పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు ఆగనున్నది.
Day 2: రెండో రోజు ఉదయం 09:35 గంటలకు పూరీకి చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని.. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, పూరీ జగన్నాథ ఆలయం (Lord Jagannath Temple) సందర్శనకు వెళ్లాలి. అనంతరం హోటల్‌కి తిరిగి వెళ్తారు. భోజనం తర్వాత రాత్రి పూరీలో(Night Stay At Puri) బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి.. హోటల్(Hotel) నుంచి చెక్ అవుట్ అవ్వాలి. అనంతరం కోణార్క్ సూర్యదేవాలయం (Sun Temple), ఒడిషా బీచ్ (Odisha Beach). సందర్శన ఉంటుంది. తర్వాత మాల్తీపాట్పూర్ రైల్వే స్టేషన్ నుంచి.. గయకు ప్రయాణం మొదలవుతుంది.
Day 4: నాలుగోరోజు ఉదయం 8:30 గంటలకు గయకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం చేసి గయలోని విష్ణుపాద దేవాలయాన్ని (Vishnu Pada Temple) సందర్శించి వారణాసికి ప్రయాణమవుతారు.
Day 5: ఐదో రోజు ఉదయం 6 గంటలకు వారణాసి (Varanasi) చేరుకుంటారు. అల్పాహారం చేసిన అనంతరం కాశీ విశ్వనాథ దేవాలయం (Kashi Viswanath Temple), కాశీ విశాలాక్షి(Kashi Vishalakshi), అన్నపూర్ణదేవీ (Annapurna Devi temple) ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతి (Ganga Aarti)ని వీక్షించి రాత్రి అయోధ్యకు ప్రయాణమవుతారు.
Day 6: ఆరో రోజు అయోధ్య(Ayodhya)కు చేరుకుంటారు. శ్రీరాముడు, హనుమంతుని(Ram Janma Bhoomi) ఆలయాలు దర్శించుకున్న తర్వాత.. సాయంత్రం సరయూ హారతి(Sarayu river Aarti)ని చూసి ప్రయాగ్‌రాజ్‌కు పయనమవుతారు.
Day 7: ఏడోరోజు ఉదయం ప్రయాగ్‌రాజ్(Pryagraj) చేరుకుంటారు. ఉదయం అల్పాహారం చేసిన అనంతరం అక్కడ త్రివేణి సంగమం(Triveni Sangam), హనుమాన్ మందిర్ (Hanuman Mandhir), శంకర్ విమాన మండపాన్ని (Shankar Viman Mandapam) సందర్శించి. తిరుగు ప్రయాణమవుతారు.
Day 8: ఎనిమిదో రోజు తిరుగు ప్రయాణంలో విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు భారత్ గౌరవ్ రైలు చేరుకుంటుంది.
Day 9: తొమ్మిదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల గుండా ప్రయాణించి రాత్రి 7:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ ‘పుణ్య క్షేత్ర యాత్ర’ టూర్ ప్యాకేజీ ధర ( PUNYA KSHETRA YATRA )
భారత్ గౌరవ్ రైలులో మూడు ప్యాకేజీలు అందుబాటులో ఉండనున్నాయి. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.31,260, స్టాండర్డ్‌లో రూ.23,875, ఎకానమీ క్లాస్‌లో రూ.15,075గా నిర్ణయించారు. ఐదు నుంచి 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.14,070, రూ.22,695, రూ.29,845గా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ రైల్లో మొత్తం 700 సీట్లు అందుబాటులో ఉండగా.. 460 స్లీపర్ బెర్తులు, 192 థర్డ్ ఏసీ బెర్త్‌లు, 48 సెకండ్ ఏసీ బెర్త్‌లు ఉంటాయి. ఇక పుణ్యక్షేత్ర రైలులో ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించనున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం ఉంటుందని, ఆయా యాత్రా స్థలాల్లో ప్రవేశ రుసుం, బోటింగ్, సాహస క్రీడలు వంటివి ఈ ప్యాకేజీ పరిధిలోకి రావని తెలిపింది.
పూర్తి వివరాల కోసం.. IRCTC వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి