Hyderabad to Karnataka Tour | ఈ వేసవిలో కర్ణాటక టూర్ వెళ్లే పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. అధ్యాత్మిక పర్యటనలో భాగంగా డివైన్ కర్ణాటక (Divine karnataka) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.
డివైన్ కర్నాటక (Divine karnataka) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. మే 23 నుంచి ప్రతి మంగళవారం ఈ ప్యాకేజీ (Divine karnataka Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఉడుపి (Udupi), శృంగేరి (Srungeri), ధర్మస్థల (Dharmasthala), కుక్కే సుబ్రమణ్య(Kukke Subramanya) తదితర అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు రైలు (కాచిగూడ – మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్) బయలుదేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.
Day 2: రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఉడిపికి చేరుకుని.. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే బస ఉంటుంది.
Day 3 : మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి.. శ్రీకృష్ణ ఆలయం సందర్శిస్తారు. తర్వాత శృంగేరి శారదాంబ ఆలయం దర్శనం ఉంటుంది. తర్వాత మంగళూరు చేరుకుంటారు. భోజనం తరువాత రాత్రి మంగళూరులోనే బస ఉంటుంది
Day 4: నాలుగో రోజు ఉదయం మంజునాథ ఆలయాన్ని దర్శించుకొనేందుకు ధర్మస్థలికి బయలుదేరుతారు. అక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్యాస్వామి ఆలయం సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి మంగళూరు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
Day 5 : ఐదో రోజు ఉదయం మంగళూరులోని స్థానిక ప్రదేశాలు కతీల్ ఆలయం (Kateel Temple), మంగళా దేవి ఆలయాలను (Mangala Devi Temple) సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకొని హైదరాబాద్ కు రైలులో( train No. 12790) తిరుగు పయనం అవుతారు.
Day 6 : ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక ప్యాకేజీ ధర (Divine karnataka)
ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.32,890 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ. 19,690 ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.16,210గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 29,990గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 16,690, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.13,210గా నిర్ధారించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR086