Hyderabad to Kaleshwaram Package Tour | సెలవులొచ్చాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్ని ఎండలుంటే ఏంటి సమ్మర్ టూర్లు వేయకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు కదా! అయితే ఈ వేసవిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వెళ్లాలనుకుంటున్నారా.? అయితే మీకోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం ఒక రోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్లో ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
కాళేశ్వరం ప్యాకేజీ టూర్ (Kaleshwaram Package Tour) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో రామలింగేశ్వర స్వామి దేవాలయం (Ramappa), మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage), కనేపల్లి పంప్ హౌజ్(Kanepally Pump House), కాళేశ్వర ఆలయం(Kaleshwaram Temple) తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.
కాళేశ్వరం ప్రయాణం సాగుతుంది ఇలా
ప్రతి శనివారం, ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరితే వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్‌కు 8 గంటలకు చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రామప్పలో రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం ఉంటుంది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage), కనేపల్లి పంప్ హౌజ్ (Kanepally Pump House), సందర్శిస్తారు. అక్కడనుంచి సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర ఆలయ దర్శనం(Kaleshwaram Temple Darshan) ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ కాళేశ్వరం టూర్ ప్యాకేజీ ధర
Hyderabad to Kaleshwaram Tour cost | పెద్దలకు రూ.1850, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1490 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, దర్శనం, హోటల్లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://tourism.telangana.gov.in/package/KaleshwaramTour