e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home టాప్ స్టోరీస్ పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌


హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ ): స్థానికంగా పోస్టాఫీసుల్లో ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని పోస్టల్‌శాఖ తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం తప్పనిసరి. గ్రామీణప్రాంతాల్లో ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేకపోవడం, ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌పై ప్రజలకు అవగాహణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళితే అక్కడి సిబ్బంది వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ సేవను అందిస్తారని పోస్టల్‌ విభాగం హైదరాబాద్‌ రీజియన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కే వెంకటరామిరెడ్డి ఆదివారం తెలిపారు. ఫొటోఐడీ ప్రూఫ్‌, ఓటీపీ కోసం మొబైల్‌ను తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌ రీజియన్‌లోని 36 హెడ్‌ పోస్టాఫీస్‌లు, 643 సబ్‌ పోస్టాఫీసులు, 10 బ్రాంచ్‌ పోస్టాఫీసుల్లో ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తామని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

ట్రెండింగ్‌

Advertisement