పట్టభద్రులందరికీ ధన్యవాదాలు : ఎమ్మెల్సీ పల్లా

హైదరాబాద్ : శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు సహకరించిన మిత్రులకు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసి దీవించిన పట్టభద్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టభద్రులందరూ ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పునిచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు అని చెప్పుకునే నాగపూర్‌తో పాటు పుణె, ఔరంగాబాద్‌లో కూడా బీజేపీ అభ్యర్థులను పట్టభద్రులు వ్యతిరేకించారు. కానీ తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వానికి అనుకూలంగా పట్టభద్రులు తీర్పునిచ్చారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులందరూ ఏకపక్షంగా విజయాన్ని అందించారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఈ ఆరు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయినప్పటికీ అద్భుతంగా కేసీఆర్ నాయకత్వాన్ని పట్టభద్రులు బలపరిచారు అని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
దివ్యాంగులకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత
అంబరాన్నంటిన ఉద్యోగుల సంబురాలు..
9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల
30 శాతం ఫిట్మెంట్, 61 ఏళ్లకు రిటైర్మెంట్.. సీఎం కేసీఆర్ మాటల్లో..
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

