నెల దాటినా నివేదిక ఏదీ?
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఆశలపై సర్కార్ నీళ్లు చల్లుతున్నది. ప్రతిసారీ ఏదోరకంగా మోసం చేస్తున్నది. కనీసం పీఆర్సీ నివేదికను కూడా తెప్పించుకోలేకపోతున్నది. సెప్టెంబర్ 9న ఉద్యోగుల జేఏసీతో చర్చల సందర్భంగా సీఎస్ సంజయ్‌జాజు సెప్టెంబర్ 18లోగా పీఆర్సీ నివేదికను తెప్పించుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణమే నివేదిక సమర్పించాలని పీఆర్సీ కమిటీకి లేఖ కూడా రాశారు.
- పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొనేదెప్పుడు?
- సీఎస్ చెప్పిన గడువు ముగిసి 30 రోజులు
- ఇసుమంతైనా కదలిక లేని కాంగ్రెస్ సర్కార్
- పీఆర్సీ ఆలస్యంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఆశలపై సర్కార్ నీళ్లు చల్లుతున్నది. ప్రతిసారీ ఏదోరకంగా మోసం చేస్తున్నది. కనీసం పీఆర్సీ నివేదికను కూడా తెప్పించుకోలేకపోతున్నది. సెప్టెంబర్ 9న ఉద్యోగుల జేఏసీతో చర్చల సందర్భంగా సీఎస్ సంజయ్‌జాజు సెప్టెంబర్ 18లోగా పీఆర్సీ నివేదికను తెప్పించుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణమే నివేదిక సమర్పించాలని పీఆర్సీ కమిటీకి లేఖ కూడా రాశారు.
సీఎస్ చెప్పిన సెప్టెంబర్ 18 గడువు దాటి నెల అవుతున్నది. కానీ సర్కార్ మాత్రం నివేదికను తెప్పించుకోలేదు. సాక్షాత్తు సీఎస్ ఇచ్చిన హామీకే అతీగతీ లేకపోవడంతో ఉద్యోగుల జేఏసీ నేతలు ఫైర్ అవుతున్నారు. దసరా పండు గలోపు పీఆర్సీ రిపోర్టును ప్రభుత్వం తెప్పించుకుని దీపావళి పండుగలోపు రెండో పీఆర్సీని వర్తింపజేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ(ముజీబ్) డిమాండ్ చేశారు.
39 నెలలు గడుస్తున్నా..
తెలంగాణ తొలి పీఆర్సీ గడువు జూన్ 30తో ముగియగా, 1 జూలై 2023 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. కానీ ఇంత వరకు పీఆర్సీని ప్రకటించకపోవడంతో ఉద్యోగులంతా 39 నెలల నుంచి నష్టపోతున్నారు. పీఆర్సీ ఆలస్యం కావడంపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సర్కార్ మీద గుర్రుగా ఉన్నాయి. ఇటీవలే పీఆర్టీయూ సైతం తక్షణమే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్), టీఎస్ యూటీఎఫ్ వంటి సంఘాలు సైతం నివేదికను తెప్పించుకుని తక్షణమే మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

