ప్రపంచ టాప్ శాస్త్రవేత్తల లిస్టులో డాక్టర్ పత్తిపాటి ఉషారాణి
ప్రపంచంలోని అగ్రగామి శాస్త్రవేత్తల జాబితాలో సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ పత్తిపాటి ఉషారాణి చోటు సంపాదించారు.
- కీటకశాస్త్ర విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 341వ ర్యాంక్
- ఐఐసిటీ విశ్రాంత శాస్త్రవేత్తకు దకిన అంతర్జాతీయ గౌరవం
- స్టాన్ ఫోర్డ్ – ఎల్సెవియర్ జాబితా ఆధారంగా టాప్ సైనెట్ ప్రకటన
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ): ప్రపంచంలోని అగ్రగామి శాస్త్రవేత్తల జాబితాలో సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ పత్తిపాటి ఉషారాణి చోటు సంపాదించారు. 2026 సంవత్సరానికి గానూ అంతర్జాతీయంగా పేరుపొందిన ‘టాప్ సైనెట్’ ప్రచురించిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల సింగిల్-ఇయర్ ర్యాంకింగ్‌లో ఆమె ఈ అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. కీటకశాస్త్రం ఉపవిభాగంలో అంతర్జాతీయ స్థాయిలో ఆమె 341వ ర్యాంకును సాధించి దేశానికీ, విభాగానికీ పేరుప్రతిష్ఠలు తెచ్చారు. అమెరికాలోని ప్రముఖ స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్ సంస్థ సంయుక్తంగా సేకరించిన ప్రామాణిక నివేదికల ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్‌ను రూపొందించారు.
పరిశోధనా రంగంలో సుదీర్ఘ ప్రస్థానం
డాక్టర్ ఉషారాణి జీవశాస్త్ర రంగంలో, ముఖ్యంగా కీటకశాస్త్ర విభాగంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. రసాయన పర్యావరణ శాస్త్రం జీవ ఆధారిత పురుగు మందులు , నానోబయోటెక్నాలజీ విభాగాల్లో ఆమె వినూత్న పరిశోధనలు నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించని, సుస్థిరమైన చీడపీడల నివారణ పద్ధతులను కనుగొనడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
కీటకాల ప్రవర్తన, వాటి నియంత్రణపై సాధించిన విజయాలకు గానూ గతంలోనూ ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ పురసారాలను అందుకున్నారు. తన శాస్త్రీయ ప్రయాణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్‌లో 130 పరిశోధనా వ్యాసాలు, 17 పుస్తక అధ్యాయాలను ప్రచురించిన డాక్టర్ ఉషారాణి, దాదాపు 10 మంది పీహెచ్ డీ పరిశోధకులకు మార్గదర్శకత్వం (గైడ్ ) వహించి నూతన శాస్త్రవేత్తల తయారీకి విశేష కృషి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

