దేశంలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు
కరోనా కేసులు|

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్ పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజూ దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకుపైగా బాధితులు మరణించారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3498 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరింది. ఇందులో 1,53,84,418 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 31,70,228 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 2,08,330 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 2,97,540 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 15,22,45,179 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 66,159 కేసులు ఉండగా, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేల నుంచి 40 వేల మధ్య రికార్డయ్యాయి. ఇక న్యూఢిల్లీలో 24,235 మందికి కరోనా వైరస్ సోకింది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 21.2 శాతంగా ఉన్నది. అంటే ప్రతి 100 మందిలో 21 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారు.
కాగా, దేశంలో ఈ ఏడాదిలో మొదటిసారిగా రోజువారీ కేసులు లక్షకుపైగా కేసులు ఏప్రిల్ 6న నమోదయ్యాయి. నెల చివరినాటికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉన్నది. ఈనెల 6న 1.15 లక్షల కేసులు నమోదవగా, ఏప్రిల్ 13న వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. అదేవిధంగా ఏప్రిల్ 15 నాటికి రోజువారీ కేసులు 2 మార్కును దాటగా, ఈ నెల 20న మరణాల సంఖ్య 2 వేలకు చేరింది. కేవలం ఆరు, ఏడు రోజుల్లోనే రోజువారీ కేసులు 3 లక్షలు, మరణాలు 3 వేలు దాటాయి. ఏప్రిల్ 21న 3 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఏప్రిల్ 27న మూడువేల కంటే ఎక్కువగా మరణాలు రికార్డయ్యాయి. దీనినిబట్టి ముందుముందు రోజువారీ కేసులతోపాటు, మరణాలు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఇంట్లో రోగులకు రెమ్‌డెసివిర్ వద్దు
భారత్ నా ఇల్లు.. రక్తమోడుతున్నది
కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ఒక్క మాత్రతో కరోనా ఠా!
కొందరి భయం ఎందరికో సంకటం
సినిమా ఇండస్ట్రీకి మరో షాక్.. ప్రముఖ దర్శకుడు మృతి
చితికిపోతున్న కుటుంబం
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

