టీకా.. రాజు-పేద!

- కరోనా టీకా వినియోగంలో ఆర్థిక అంతరాలు
- వ్యాక్సిన్లను కొని దాచుకొంటున్న ధనిక దేశాలు
- ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో స్థానికంగా వినియోగం
- టీకాలకు కొరత.. పేద దేశాలకు నిలిచిన సరఫరా
- ఆదుకునేందుకు ఐరాస చేస్తున్న యత్నాలకు ఆటంకాలు
లండన్, ఏప్రిల్ 10: కరోనా వైరస్ ప్రపంచమంతటా ధనిక, పేద దేశాలపై ఒకేవిధమైన ప్రభావం కలిగిస్తూ తీవ్ర భయాందోళనకు కారణమవుతున్నప్పటికీ.. ఆ వైరస్‌పై యుద్ధంలో మాత్రం అన్ని దేశాలూ కలిసికట్టుగా పోరాడని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, కరోనా టీకాల వినియోగంలో ధనిక, పేద దేశాల మధ్య అంతరం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సంపన్నదేశాల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి టీకా అందుతుంటే.. పేద దేశాల్లో 500 మందిలో ఒక్కరికి కూడా టీకా లభించటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ చెప్పటం.. టీకా వినియోగంలో ఏ స్థాయిలో ఆర్థిక అంతరాలు ప్రభావం చూపుతున్నాయో తెలుపుతున్నది. ధనిక దేశాలు టీకాల ఉత్పత్తిని, సరఫరాను నియంత్రిస్తున్నాయి. తమ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల కోసం ముందే కొనిపెట్టుకొంటున్నాయి. ఫలితంగా.. పేదదేశాలకు టీకాలు అందజేయడానికి ఐక్యరాజ్యసమితి తలపెట్టిన ‘కోవాక్స్’ కార్యక్రమం ఆచరణలో అనుకొన్న ఫలితాలను ఇవ్వడం లేదు. కొన్ని దేశాల్లో ఉత్పత్తి అవుతున్న కరోనా టీకాలను ఆ దేశాలే వినియోగించుకొంటున్నాయి. ఎగుమతులపైన ఆంక్షలు విధిస్తున్నాయి.
60 దేశాల్లో రెండో డోసు కష్టమే
‘కోవాక్స్’ ద్వారా 92 దేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 3.8 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దాదాపు 60 దేశాల్లో మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ దేశాలకు కొత్త చిక్కు వచ్చింది. మొదటి డోసు తీసుకొన్నవారికి సకాలంలో రెండో డోసు ఇవ్వడానికి టీకాలు అందుబాటులో లేవు. టీకాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయాదేశాలు సొంత వినియోగానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనివల్ల జూన్ చివరి దాకా వ్యాక్సిన్లు అందే పరిస్థితి లేదు. మనదేశంలో పుణెలో ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎగుమతులు నిలిపివేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం కూడా కోవాక్స్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. టీకాల సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో అనేక దేశాలు కోవాక్స్ కార్యక్రమంపై నమ్మకం కోల్పోతున్నాయి.
- ఇక్కడ ఐదుగురిలో ఒకరికి..
- అక్కడ 500 మందిలో ఒక్కరికీ లేదు
వ్యాక్సిన్ పొందే అంశంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అసమానతలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ధనిక దేశాల్లో ప్రతీ నలుగురిలో ఒకరు టీకా పొందితే.. పేద దేశాల్లో 500 మందిలో కనీసం ఒక్కరికి కూడా టీకా అందటంలేదని అన్నారు. కోవాక్స్ను కాదని కొన్ని దేశాలు ఇతర దేశాలకు నేరుగా టీకాలను విరాళం ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలకు ఇది కూడా ఓ కారణమన్నారు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

