
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): నూతన జోనల్, మల్టీజోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. శనివారం ఒకేరోజు 12 శాఖల ఉద్యోగుల కేటాయింపునకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్‌తోపాటు ఆయా శాఖల హెచ్‌వోడీల నేతృత్వంలోని కమిటీలు జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించాయి. శనివారం ట్రెజరీ, రవాణాశాఖ, పంచాయతీరాజ్, ప్లానింగ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, మున్సిపల్, అటవీ, అగ్నిమాపక- హోం, ఆయుష్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక, వెటర్నరీ, సహకారశాఖల ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి కేటాయింపులు పూర్తిచేశారు. సమావేశాల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ పాల్గొన్నారు.