హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : సరూర్‌నగర్ ‘యువ సంగ్రామ సదస్సు’ విజయవంతంపై బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హర్షం వ్యక్తంచేశారు. సదస్సు సక్సెస్‌కు కృషి చేసిన బీఆర్ఎస్ శ్రేణులు, తరలివచ్చిన నిరుద్యోగ యువతకు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించినా, అడుగడుగునా ఆటంకం కలిగించినా యువత పెద్దసంఖ్యలో తరలివచ్చినట్టు తెలిపారు. సర్కార్‌పై నిరుద్యోగుల ఆగ్రహానికి ఈ సదస్సు నిదర్శనమని పేర్కొన్నారు. యువత సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ఇంతటితో ఆగదని, ఉద్యోగాలు భర్తీ చేసేదాకా, నిరుద్యోగులకు మేలు జరిగేదాకా నిరంతరం పోరాడుతామని స్పష్టంచేశారు.