హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): యూపీఎస్‌కు వ్యతిరేకంగా మార్చి 2న యూపీఎస్ యుద్ధభేరి సభను నిర్వహించనున్నట్టు సీపీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించారు. ఇందిరాపార్కులో నిర్వహించే సభ గోడప్రతులను బుధవారం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉపాధి, శిక్షణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, కల్వల్ శ్రీకాంత్, మ్యాన్ పవన్‌కుమార్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు..
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చే స్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ అభ్యర్థులకు తెలంగాణ ఉపాధి, శిక్షణ ఉద్యోగుల సంఘం మద్దతు తెలిపింది. క రీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ స్థానంలో పో టీ చేస్తున్న తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, న ల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి పోటీచేస్తున్న డాక్టర్ కొలిపా క వెంకటస్వామికి మద్దతు తెలుపు తూ సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞకు లేఖకు అందించింది.