హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లోని నాలుగో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ డేట్ (COD)పై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎప్పుడు చేయాలన్న అంశంపై తేల్చుకోలేకపోతున్నారు. బుధవారం ఇదే అంశంపై టీజీ జెన్కో, బీహెచ్ఈఎల్, వైటీపీఎస్ అధికారులు సమాలోచనలు జరిపారు. సీవోడీలో భాగంగా యూనిట్-4 పూర్తిస్థాయి సామర్థ్యం, అంటే 800 మెగావాట్ల లోడ్‌తో 72 గంటల పాటు ఏకధాటిగా నడిపించాల్సి ఉంటుంది. ఈ 72 గంటల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోతే సీవోడీ విజయవంతంమైనట్టు ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తారు. వైటీపీఎస్ యూనిట్-4 సీవోడీని ఈ నెలలోనే పూర్తిచేయాల్సి ఉంది. ఇందుకు అధికారులు రెడీ అయ్యారు. అంతలోనే రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ కాస్త తగ్గింది.