హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చే యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 తర్వాత ఒక యూనిట్లో ట్రయల్న్‌క్రు జెన్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్లాంట్‌లోని రెండు యూనిట్లల్లోని బాయిలర్లను టీఎస్ జెన్కో అధికారులు ఇటీవలే వెలిగించారు. యూనిట్ -1, యూనిట్ -2 ఆగ్జిలరీ బాయిలర్లను మే 14న వెలిగించారు. ప్రస్తుతానికి నార్మలైజేషన్ ప్రక్రియను చేపట్టనుండగా, ఇది ముగిసిన తర్వాత ఈ నెల 15 నుంచి ట్రయల్న్‌న్రు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో యూనిట్ -2లో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
టార్గెట్ మార్చి – 2025
వచ్చే ఏడాది మార్చికల్లా వైటీపీఎస్‌లో ఐదు యూనిట్లను పూర్తి చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి రొనాల్డ్‌రాస్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, జెన్కో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానందం, యాదాద్రి థర్మల్ ప్లాంట్ చీఫ్ ఇంజినీర్ సమయ్య పాల్గొన్నారు.