హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఏపీ మద్యం పాలసీ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో శనివారం ఆయనను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించాక అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. చివరికి సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు.