హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అదానీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సూచించారు. అదానితో బిజినెస్ చేయొద్దని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికా గౌతమ్ అదానీ పై అభియోగాలు చేసింది. గౌతం అదాని టీం దేశంలో కొంత మంది సీఎంలకు లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు వెల్లడించారు. జగన్ పేరు చెప్పలేదు కాని ఆగస్టు 2021లో ముడుపులు ముట్టాయని తెలిపారు.
నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారు. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అప్పుడు గాడిదలు కాసారా? ఎంక్వైరీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభాస్‌కు నాకు సంబంధం ఉందని వచ్చిన ప్రచారం మీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా? మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదన్నారు.
ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదన్నారు. జగన్ ఈ ప్రాపగాండా చేయించారని ఆరోపించారు. వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారు . జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మ పై కేసు పెడతారు. నాన్న పేరు సీబీఐ చార్జి షీట్లో పెడతారు. చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు. జగన్ మోదీకి దత్త పుత్రుడని, ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? అని ప్రశ్నించారు.