హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అదానీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బిజినెస్ చేయొద్దని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సూచించారు. గురువా రం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. అదానీ గ్రూప్ సంస్థలను తెలంగాణ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడితో వ్యాపారం చేయడం సరికాదని పేర్కొన్నారు. అదానీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రధాని మోదీ ఎందు కు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ప్రభాస్ ఎవరో తెలియదు..
ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చే స్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రభాస్ ఎవరో తనకు తెలియదని, ఇప్పటి వరకు ఆయనను చూడనేలేదని స్పష్టంచేశారు. ఆ తప్పుడు ప్రచారాన్ని జగన్‌కు చెందిన సోషల్ మీడియా చేసిందని ఆరోపించారు. అది బాలకృష్ణ ఇంటి ఐపీ అడ్రస్‌తో వచ్చిందని, జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలి
అదానీ గ్రూప్ కంపెనీల అక్రమ వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ చేపట్టాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర నగర కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. మోదీ-అదానీ అనుబంధం దేశానికి పెనుముప్పుగా పరిణమించిందని తెలిపారు. అదానీ లాంటి కార్పొరేట్ అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని, లేదంటే దేశసంపద బడాబాబుల జేబుల్లోకి వెళ్తుందని తెలిపారు. కేంద్రం అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.