షర్మిల కుటుంబం తెలంగాణ ద్రోహి
హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు ఎక్కడిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. షర్మిలది మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసిన కుటుం బం అని విమర్శించారు. షర్మిల తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దగ్గరి నుంచి ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి
- తండ్రి వైఎస్, అన్న జగన్ వరకు అందరూ తెలంగాణ ద్రోహులే
- తెలంగాణలో కిరాయి మనుషుల పరాయి ఆటలు సాగబోవు
- షర్మిలది సంస్కార హీనమైన భాష
- ఇది ఆడపిల్ల మాట్లాడే భాషేనా ?
- షర్మిల భాష తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయ్
- విప్ బాల్క సుమన్ హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు ఎక్కడిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. షర్మిలది మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసిన కుటుం బం అని విమర్శించారు. షర్మిల తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దగ్గరి నుంచి ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి వరకు అందరూ తెలంగాణ ద్రోహులేనని ఆరోపించారు. తెలంగాణలో కిరాయి మనుషుల పరాయి ఆటలు సాగవని హెచ్చరించారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిల భాష సంస్కార హీనంగా ఉన్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చివరికి సీఎం కేసీఆర్‌ను సైతం లెక్కలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శృతి మించుతున్న షర్మిల బూతులు
షర్మిలది సంస్కార హీనమైన భాష అని బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు అనే స్పృహతోనే ఇన్నాళ్లు షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదని అన్నారు. ఇటీవల ఆమె శృతిమించి పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలు చేసే స్థాయికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దొంగలు, బందిపోట్లు, చెప్పుతో కొడతాననే దాకా షర్మిల వెళ్లారని మండిపడ్డారు. షర్మిల కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు బద్ద వ్యతిరేకమని విమర్శిం చారు. తెలంగాణపై ఎవరెలా విషం కక్కారో ఆయన వీడియో క్లిప్‌లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. షర్మిలకు తెలంగాణ సం స్కృతి గురించి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు.
నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం ఆమె భాషా కుసంస్కారానికి నిదర్శమని విమర్శించారు. ఆమె చెప్పుతో కొడతా అన్నా సహించాలా? అని నిలదీశారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిన వ్యక్తిని.. దేశం గర్వించే రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌ను తాలిబన్లతో పోల్చిన వ్యక్తిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు. ఆమె నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాలని హితవు పలికారు. రంగారెడ్డి జిల్లాలో షర్మిల అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. షర్మిలతో ఎవరు పలికిస్తున్నారో తమకు తెలుసని పేర్కొన్నారు. కృ ష్ణా, గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించి, వనరులను దోచుకొన్న కుటుంబం షర్మిలది అని ఆరోపించారు. వైఎస్ షర్మిల తన భాష తీరు మార్చుకోకపోతే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసినప్పుడు గవర్నర్ ఎం దుకు స్పందించలేదని నిలదీశారు. తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్ కుటుంబం చేసిన ప్ర కటనల వీడియోలు, ట్వీట్లను సుమన్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్ కుటుంబం చేసిన వ్యాఖ్యలు
మీలో ఏ ఒక్కరైనా హైదరాబాద్‌లో వ్యాపారం చేయాలన్నా.. ఏ ప్రైవేట్ కాలేజీ పెట్టుకోవాలన్నా.. మరోటి చేయాలన్నా.. టీఆర్ఎస్ చంద్రశేఖర్‌రావు అన్నీ మూసేపిస్తాం అంటున్నడు. అంటే హైదరాబాద్ అసలు మన రాష్ట్రంలో భాగం కాకుండా పోతుంది. మనం హైదరాబాద్‌లో విదేశీయులం అయిపోతాం జాగ్రత్త.
– 2009 నంద్యాల ఎన్నికల బహిరంగసభలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
‘స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్
– ఎంపీగా వైఎస్ జగన్ లోక్‌సభలో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ప్రదర్శించిన ప్లకార్డు
పలు సందర్భాల్లో షర్మిల వ్యాఖ్యలు
- ‘హైదరాబాద్‌లో సీమాంధ్రులు బతకటం అంటే పాకిస్థాన్‌లో బతికినంత కష్టం అయిపోదా?’
- ‘రాజశేఖర్‌రెడ్డి విభజనకు కారణం అని చెప్తున్నారు. రాజశేఖర్‌రెడ్డిగారు మన రాష్ర్టాన్ని ఎంత సమైఖ్యంగా ఉంచాలని కోరుకున్నారో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఈ గతి పట్టేదా?
- ‘ఈ రోజు మీరు తిరిగి వచ్చి ఉంటే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యేది కాదు రాజన్న. మిస్ యూ రాజన్న’
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

