నాంపల్లి కోర్టులు, జూన్ 19 (నమస్తే తెలంగాణ): అక్రమాస్తుల కేసుల్లో ప్రధా న నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కోర్టుకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సీబీఐ పిటీషన్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి హోదా లో కోర్టుకు హాజరయ్యేందుకు ఇబ్బందులున్నాయని గతంలో జగన్ పేర్కొనడం తో తెలంగాణ హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఆయనపై 11 సీబీఐ, 9ఈడీ కేసు లు నమోదయ్యాయి. ప్రస్తుతం జగన్ సీ ఎంగా లేడని, మినహాయింపును ఎత్తివేయాలని సీబీఐ హైకోర్టును కోరనున్నది. గురువారం నుంచి జరగనున్న విచారణ లో హాజరుకావాలని కోరింది. వారానికి రెండ్రోజులైనా హాజరయ్యేవిధంగా ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొన్నది.