హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 7వ నిందితుడు వైఎస్ భాసర్రెడ్డిని ఏపీ వెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు పలు షరతులు విధిస్తూ జస్టిస్ కే సుజన మంగళవారం ఆదేశాలు జారీచేశారు. వివేకా హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోరాదని, ఏపీలో చేయబోయే ప్రయాణ వివరాలు, ఎకడ ఉండేదీ, ఫోన్ నంబర్లను ఆ రాష్ర్టానికి వెళ్లడానికి కనీసం 72 గంటల ముందుగా సీబీఐ దర్యాప్తు అధికారికి తెలియజేయాలని ఆదేశించారు. లైవ్ లొకేషన్‌ను కూడా షేర్ చేయాలని స్పష్టం చేసింది.