జనగామ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని కొడకండ్ల మండలం ఎంసీ తండాకు చెందిన పలువురు యువకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రికి మద్దతు తెలిపిన భవన నిర్మాణ కార్మిక సంఘం
బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛంద మద్దతు వెల్లువలా కొనసాగుతూనే ఉంది. కాగా, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ను బలపరుస్తూ.. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి ఎర్రబెల్లికి పాలకుర్తి, కొడకండ్ల మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్వర్యంలో మంత్రిని కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన వారిలో వల్లపు శ్రీను, మట్టే అంజయ్య, ఈదుల వెంకన్న, తదితర భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి మద్దతు తెలిపిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు