రామచంద్రాపురం, నవంబర్11: క్రికె ట్ బెట్టింగ్‌లో అప్పులు ఎక్కువై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడ కమాన్‌లోని ఓయో లాడ్జిలో మంగళవారం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ జగన్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన సంగీత్రావు ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్‌కాలనీలో వర్క్‌షాప్ నిర్వహిస్తారు. ఆయన కుమారుడు అఖిల్(31) తండ్రి వ్యాపారానికి తోడుగా ఉండేవాడు.
ఆన్లైన్లో క్రికె ట్ బెట్టింగ్‌లు ఆడి నష్టపోవడంతో అప్పుల య్యాయి. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చిన అఖిల్ 12.45 గంటలకు బీరంగూడ కమాన్‌లో ఉన్న లావిష్ ఓక్ ఓయో లాడ్జ్జిలో దిగాడు. సా యంత్రం అఖిల్ తన తండ్రికి కాల్ చేసి క్రికెట్ బెట్టింగ్‌లో లాస్ అయ్యాను అని చెప్పడంతో.. ముందు నువ్వు ఇంటికి వచ్చే య్ ఏదైనా చూ సుకుందాం అని చెప్పగా కాల్ కట్ చేశాడు. ఆ తర్వా త అఖిల్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసి నా లిఫ్ట్ చేయలే దు.
మంగళవారం మధ్యా హ్నం రూం చెక్ ఔట్ చేసే సమయం కావడంతో లాడ్జి వాళ్లు డోర్ కొట్టినా ఓపెన్ చే యకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లాడ్జి వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే అఖిల్ ఆచూకీ కోసం వెతుకుతున్న కుటుం బ సభ్యులు లాడ్జి వద్దకు రాగా వారి సమక్షంలో పోలీసులు డోర్ పగులగొట్టి చూసేసరికి ఫ్యాన్‌కి ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.