హైదరాబాద్ : కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు. మహోరాష్ట్రకు చెందిన గర్భిణికి కరోనా సోకినా, నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవం చేయడంతో పాటు, జనగామ ఎంసీహెచ్ దవాఖానలో కరోనా సోకి క్లిష్ట పరిస్థితిలో ఉన్న గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేశారు.
క్లిష్ట పరిస్థితులలో వెలకట్టలేని సేవలందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న సేవలందిస్తున్న రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు అంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా అభినందించారు.
క్లిష్ట పరిస్థితులలో వెలకట్టలేని సేవలందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు.
— Harish Rao Thanneeru (@trsharish) January 23, 2022
2/2