కథలాపూర్, మార్చి 31: గ్రూప్-1, 2 పరీక్షలు రాసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో చోటుచేసుకున్నది. పోలీసు ల కథనం ప్రకారం.. కథలాపూర్ మండల కేం ద్రానికి చెందిన ఆకుల శ్రుతి(27) ఎంకాం పూర్తి చేసి, గ్రూప్స్‌కు సన్నద్ధమైంది. ఇటీవలే గ్రూప్-1, 2 పరీక్షలు రాసింది.
ఇటీవల విడుదలైన ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం, తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురై మంచానికి పరిమితం కావడంతో కలత చెందిం ది. ఏడాదిగా కడుపు నొప్పితో బాధపడుతూ పలు దవాఖానల్లో చికిత్స చేయించుకోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రుతి సోమవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు.