చాదర్‌ఘాట్, జనవరి 1: యువకులకు డ్రగ్స్ విక్రయిస్తున్న యువతిని హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. సంతోష్‌నగర్ ఎల్ఐజీహె చ్ కాలనీకి చెందిన ఆయేషా ఫిర్దౌస్ (21) ఇటీవల ముంబై వెళ్లి నిషేధిత డ్రగ్ ఎండీఎంఏ (యాంఫెటామైన్)ను 8 గ్రాములు కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చింది. నూతన సంవత్సరం వేళ ఈ డ్రగ్‌ను చాదర్‌ఘాట్‌కు చెందిన ఖిజారుద్దీన్ అనాస్, సైదాబాద్ కాలనీకి చెందిన మహ్మద్ అఫన్, కుర్మగూడ సైదాబాద్‌కు చెందిన అయాజ్ఖా న్, భానునగర్ సైదాబాద్‌కు చెందిన షాబా జ్ షరీఫ్‌కు విక్రయిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో సోమవారం ఉదయం నల్లగొండ చౌరస్తాలో ఆయేషాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 8 గ్రా ముల యాంఫెటామైన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెతోపాటు నలుగురు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. యువకులందరూ 21 ఏళ్ల వారేనని ఏసీపీ శ్యాంసుందర్ తెలిపారు.