మలక్‌పేట, డిసెంబర్ 25 : పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి కి తెగబడ్డాడో ఉన్మాది. కుటుంబసభ్యులు అడ్డుపడ్డా వదలకుండా దాడిచేయడంతో గాయాలపాలై ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి మూసారాంబాగ్ శాలివాహననగర్‌లో మంగళవారం దారుణం జరిగింది. బా ధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడ కానూర్‌కు చెందిన పోతన వెంకట దుర్గాప్రసాద్(32) శాలివాహననగర్‌లో ఉంటూ ఓ కారు వాష్ షో రూంలో పనిచేస్తున్నాడు. తన ఇంటి పక్కనే వంటమనిషి యాదమ్మ తన ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి ఉంటున్న ది. యాదమ్మకు భర్త లేకపోవటంతో అప్పుడప్పుడు కూరగాయలు, సరుకులు తెచ్చిస్తూ వారితో దుర్గాప్రసాద్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు.
పెద్ద కూతురు విజయలక్ష్మి(24)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామ ని దుర్గాప్రసాద్ అ డగగా ఇద్దరి కులా లు వేర్వేరు కావటంతో ఆమె నిరాకరించింది. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చంపేస్తానని దుర్గాప్రసాద్ బెదిరిస్తూ వచ్చాడు. 20 రోజులుగా యువతి దూరంగా ఉంటుడడంతో మరింత కోపం పెంచుకున్న దుర్గాప్రసాద్, మంగళవారం డాబాపై బట్టలు ఆరేసేందుకు ఆమె వెళ్లడం గమనించి టెర్రస్‌పైకి వెళ్లి కత్తితో ఒక్కసారిగా దాడిచేశాడు. అరుపులు విన్న తల్లి, సోదరి, సోదరుడు వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా గొంతు, పొట్ట, చేతులపై దాడిచేయడంతో యువతి గాయపడింది. ఇరుగు పొరుగువారు 100కు ఫోన్‌చేయగా.. మలక్‌పేట పోలీసులు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని యువతిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. దుర్గాప్రసాద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.