ములుగు : విహారం కాస్త విషాదంగా ముగిసింది. ఈత సరదాడా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు(Mulugu Dist) జిల్లా వాజేడు మండలం కొంగాల జలపాతంలో(Kongala Waterfall )ఓ యువకుడు గల్లంతయ్యాడు.(Young Man missing) మంచిర్యాల జిల్లాకు చెందిన బి.అభినవ్ (17) ఘట్కేసర్ అనురాగ్ యూనివార్సిటీలో బిటెక్ మొదటి సంవ త్సరం చదువుతున్నాడు. స్నేహితులతో సరదాగా వచ్చి ఈత కొడుతూ కొంగాల జలపాతంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వాజేడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.